లిప్ లాక్ తో న్యూ ఇయర్ కి వెల్ కం

by సూర్య | Sun, Jan 03, 2021, 10:00 AM

న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని కొందరు మామూలుగా జరుపుకుంటే..మరికొందరు వినూత్నంగా జరుపుకున్నారు. అలా బాలీవుడ్ దంపతులు సోనమ్ కపూర్.. ఆనంద్‌ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. తన భర్త ఆనంద్‌ను గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు. 2021కు స్వాగతం పలుకుతున్నా.. ఈ ఏడాదంతా స్నేహితులు, ప్రేమ, పని, ప్రయాణాలు, ఆధ్యాత్మిక, ఇలా అన్నింటి మేళవింపుతో నిండనుంది. మరిన్ని మంచి క్షణాలు ఎంజాయ్‌ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారగా ఆమె అభిమానులు సోనమ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట లండన్‌లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు.


 

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM