హాట్ భామ షామా శికందర్ అందాల విందు !

by సూర్య | Sat, Jan 02, 2021, 12:37 PM

బుల్లితెర యాంకర్ కం నటి షామా శికందర్ అడ్డూ ఆపూ లేని ఫోటోషూట్ల పై వివరణలు అవసరం లేదు. ఈ అమ్మడు గత కొంతకాలంగా వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతున్న సంగతి తెలిసినదే. ఇంతకుముందు మాల్దీవుల నుంచి వేడెక్కించే బికినీ బీచ్ ఫోటోలతో విరుచుకు పడిన షామా లేటెస్టుగా ఇండోర్ ఫోటోషూట్ తోనూ అగ్గి రాజేస్తోంది. ఇటీవలే బికినీ బీచ్ లో న్యూఇయర్ సెలబ్రేషన్ తోనూ తనదైన శైలిలో హీట్ పెంచింది.తాజాగా కిచెన్ ఫోటోషూట్ మైమరిపిస్తోంది. హాలీవుడ్ స్టార్లు పాప్ స్టార్లకే మతి చెడేలా షామా ఇచ్చిన ఫోజు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. అసలు హద్దులు చెరిపేసేలా గ్లామర్ షోకి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ అమ్మడు ఫీలర్స్ వదులుతోంది. థై సొగసుల ఎలివేషన్ లో తనని కొట్టేవాళ్లే లేరని ఫీలవుతోంది. షామాకు హిందీ బుల్లితెరతో పాటు వెండితెర అవకాశాలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయని సమాచారం.


ఇంతగా శ్రమిస్తున్నందుకైనా సౌత్ పిలిచి అవకాశం ఇస్తుందేమో చూడాలి. ఇటీవల నెమ్మదిగా షూటింగులు ఊపందుకుంటున్నాయి. దాదాపు 100 సినిమాలు చిత్రీకరణల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఐటెమ్ నంబర్ కి అయినా అవకాశం లేకపోతుందంటారా? జీవితం చీకటి వెలుగుల దోబూచులాట. నీకు నువ్వే లాంతరు! అంటూ అమ్మడు అద్భుతమైన కవితల్ని అల్లుతోంది.




Latest News
 
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM