నటించడానికి రెడీ అయిన రియా చక్రవర్తి

by సూర్య | Fri, Jan 01, 2021, 04:20 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం, ఆ తదనంతరం తెర మీదకు వచ్చిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టు కూడా ఆయన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె బెయిల్ మీద విడుదల అయింది. కొన్నాళ్ళ పాటు జైలు జీవితం గడిపిన ఈ అమ్మడు మరల సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ కేసుల వలన చాలా కాలంగా మానసికంగా కృంగి పోయిన ఆమె ఇప్పుడు మరలా సాధారణ స్థితికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. మరో నెల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకానున్న రియా చక్రవర్తి ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఆమె ఇప్పటికే ఒక చిన్న బడ్జెట్ సినిమా సైన్ చేసింది అని చెబుతున్నారు. బహుశా ఆ సినిమా షూటింగ్ లోనే ఆమె పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటుగా ఆమె ఒక రియాలిటీ షో లో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈమె తెలుగులో కూడా ఒక సినిమాలో నటించాల్సి ఉంది. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ మచ్చి అనే సినిమాలో నటించాల్సి ఉంది.


ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకున్న ఈ భామ మధ్యలో తాను చేయలేని అంటూ హ్యాండ్ ఇచ్చింది. ఈ ఈ క్రమంలోనే సినిమా యూనిట్ మరో హీరోయిన్ ని ఎంపిక చేసుకుంది. చివరిగా రియా చక్రవర్తి జిలేబి అనే ఒక సినిమాలో నటించింది. ఇక ఆమె నటించిన చెహ్రే అనే సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా తరువాత రియాకి పెద్దగా సినిమా అవకాశాలు అయితే రాలేదు. చిన్న బడ్జెట్ సినిమా అవకాశం మాత్రమే ఆమెకు దక్కింది అని అంటున్నారు.


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM