పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' టీజర్ దసరాకైనా వస్తుందా..?

by సూర్య | Fri, Oct 16, 2020, 05:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా చేస్తున్న వకీల్ సాబ్ కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ తో బ్రేక్ తీసుకుంది. ఇక అన్ లాక్ ప్రక్రియలో భాగంగా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆల్రెడీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో వకీల్ సాబ్ కూడా సెట్స్ మీదకు వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ 70 శాతం పూర్తయిన ఈ సినిమాకు పవన్ కు సంబందించిన మరో 20 రోజుల షెడ్యూల్ ఒకటి పెండింగ్ ఉందని తెలుస్తుంది.
ఇదిలాఉంటే వకీల్ సాబ్ టీజర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే దసరాకి టీజర్ తప్పకుండా వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. దసరాకి కూడా వకీల్ సాబ్ టీజర్ వదిలే ఆలోచనలో లేరని తెలుస్తుంది. దసరాకి టీజర్ ల పండుగ ఉంటుందని ఆశించిన తెలుగు ఆడియెన్స్ కు నిరాశ కలిగిస్తున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ కొమరం భీం టీజర్ అక్టోబర్ 22న రిలీజ్ ప్లాన్ చేశారు.
ఇక మరోపక్క రాధే శ్యాం టీం కూడా అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందభంగా సినిమా టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే వకీల్ సాబ్ నుండే టీజర్ వస్తుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM