కరోనాను జయించిన ఆనందంలో మళ్లీ తన ఫిట్ నెస్ సాధన వైపు తమన్నా

by సూర్య | Fri, Oct 16, 2020, 04:07 PM

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారినపడడం, ఆ వైరస్ ను జయించడం తెలిసిందే. తమన్నా ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి సెట్లోనే అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని ముంబయి వెళ్లిపోయింది. సాధారణంగా ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిచ్చే తమన్నా కరోనాను జయించిన ఆనందంలో మళ్లీ తన ఫిట్ నెస్ సాధన వైపు అడుగులేసింది.


వార్మప్ ఎక్సర్ సైజులకు సంబంధించిన ఓ వీడియోను తమన్నా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. తన స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తాను తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె పేర్కొంది. శరీరం చెప్పేది వింటూ ముందుకు పోతుండాలని సూచించింది.

Latest News
 
నేడు విడుదల కానున్న 'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ Tue, Apr 16, 2024, 02:34 PM
'టిల్లు స్క్వేర్' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Apr 16, 2024, 02:30 PM
రేపు రివీల్ కానున్న 'చియాన్ 62' అప్డేట్ Tue, Apr 16, 2024, 02:28 PM
'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగురాష్ట్రాల గ్రాస్ ఎంతంటే...! Tue, Apr 16, 2024, 02:22 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మిస్టర్ బచ్చన్' Tue, Apr 16, 2024, 02:18 PM