వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు

by సూర్య | Fri, Oct 16, 2020, 02:52 PM

బాలీవుడ్ తో పాటు కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. రెండు పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే పలువురు విచారణ ఎదుర్కొన్నారు. కొందరు ఊచలు కూడా లెక్కబెడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడే ఆదిత్య. ఈ నేపథ్యంలో ఆదిత్య కోసం వివేక్ నివాసంలో బెంగళూరు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఆచూకీ లభించకపోవడంతో ప్రియాంకకు ఈరోజు నోటీసులిచ్చారు. తన సోదరుడికి సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించడానికి ఆమెను విచారించనున్నారు.

Latest News
 
ఆఫీసియల్ : 'ఆ ఒక్కటి అడక్కు' విడుదలకి తేదీ లాక్ Tue, Apr 16, 2024, 02:37 PM
నేడు విడుదల కానున్న 'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ Tue, Apr 16, 2024, 02:34 PM
'టిల్లు స్క్వేర్' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Apr 16, 2024, 02:30 PM
రేపు రివీల్ కానున్న 'చియాన్ 62' అప్డేట్ Tue, Apr 16, 2024, 02:28 PM
'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగురాష్ట్రాల గ్రాస్ ఎంతంటే...! Tue, Apr 16, 2024, 02:22 PM