'ఆద్య' చిత్రంలో నటించనున్నరేణు దేశాయ్

by సూర్య | Fri, Oct 16, 2020, 01:59 PM

చాలా సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ తిరిగి మేకప్ వేసుకోనున్నారు. బహుభాషా చిత్రంగా రూపొందుతున్న 'ఆద్య' అనే చిత్రంలో ఆమె ఓ శక్తిమంతమైన మహిళ పాత్రను పోషించనున్నారు. మంచి కథ ఉంటే తాను తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమని గతంలో పలుమార్లు చెప్పిన రేణు, దర్శకుడు ఎంఆర్ కృష్ణ చెప్పిన కథను ఓకే చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఈ సినిమాతోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఇక, ఈ చిత్రంలో వైభవ్, సాయి ధన్సిక, నందినీ రాయ్, తేజ, కీతికా రతన్ తదితరులు నటిస్తుండగా, దీనిని డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నామని, ఈ నెలలో ప్రారంభమయ్యే షూటింగ్ మార్చి వరకూ కొనసాగుతుందని, ఆపై సమ్మర్ సీజన్ లో విడుదల చేస్తామని నిర్మాత డీఎస్ రావు వెల్లడించారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM