అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నా : సంజయ్ దత్

by సూర్య | Fri, Oct 16, 2020, 01:04 PM

లంగ్‌ కేన్సర్‌ అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉండడంతో చికిత్స తీసుకుంటోన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటిల్లో ఆయన సన్నగా, క‌ళ్లు లోప‌లికి పోయి, నీరసంగా కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే, ఈ రోజు ఆయన తనకు సంబంధించిన మూడు ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. పూర్తిగా పాత సంజయ్ దత్‌లా మారిపోయిన ఆయనను చూస్తోన్న అభిమానులు ఆశ్యర్యపోతున్నారు.


ఇటీవల అభిమానుల్ని ఆందోళన‌కు గురిచేసిన సంజయ్‌ దత్‌ లుక్‌లకు భిన్నంగా ఈ ఫొటోలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో ఆయన సినిమాల్లో నటించే విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కన్నడ సినిమా కేజీఎఫ్‌-2లో ఆయన కీలకమైన అధీరా పాత్రలో నటించాల్సి ఉంది. అందులో ఆయన నటిస్తారా? లేదా? అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నానని ఆయన ప్రకటించారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM