అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. : నాగార్జున

by సూర్య | Fri, Oct 16, 2020, 12:57 PM

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీనటుడు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా బాగానే ఉంది’ అని నాగార్జున ట్వీట్ చేశారు.


కాగా, అన్నపూర్ణ స్టూడియో కూడా  తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని, నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నామని పేర్కొంది. నిన్న సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM