మ్యాగజైన్ కవర్ పేజీపై నిహారిక.

by సూర్య | Fri, Oct 16, 2020, 08:47 AM

పెళ్లికి ముందే పెళ్లి కూతురులా ముస్తాబైంది హీరోయిన్ నిహారిక.  ప్రఖ్యాత యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై సంథింగ్ స్పెషల్ గా డిజైనర్ లుక్ లో కనిపించి మనసులు దోచేసింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏనాడూ కనిపించనంత కొత్తగా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది ఈ వేషధారణలో. ఐజీ కుమారుడు చైతన్యను పెళ్లాడేందుకు మెగా ప్రిన్సెస్ సిద్ధమవుతున్న వేళ .. ఈ మేకోవర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఈ బ్రైడల్ డిజైన్ చేసినది ఏ డిజైనర్? అన్నది పరిశీలిస్తే… హైదరాబాద్ పంజాగుట్ట మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ ఇదని నిహారిక స్వయంగా ఇన్ స్టా లో వెల్లడించింది. అశ్విని రెడ్డి – వరుణ్ చక్కిలం ఔట్ ఫిట్స్ అందించగా .. శాండీ శాస్త్రి మేకప్ హెయిర్ డిజైన్ పనితనం కనబరిచారట. మొత్తానికి మెగా ప్రిన్సెస్ ని డెకరేట్ చేసిన తీరు వారెవ్వా అనిపిస్తోంది. నిహారిక ఈ గెటప్ లో పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మునుపటి కంటే స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది.


 


 


 

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM