తమిళ హీరోల ఇంట్లో బాంబు పెట్టమంటూ ఫేక్ బాంబు ఫోన్ కాల్స్

by సూర్య | Wed, Oct 14, 2020, 02:51 PM

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు ధనుష్, విజయకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పోలీసులకు ఫోన్ రావడంతో ఉరుకులుపరుగులు పెట్టారు. నిన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్ చేశారు. అభిరామపురంలోని ధనుష్, విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పేర్కొన్నారు.


దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో వారిళ్లకు చేరుకుని అణువణువు క్షుణ్ణంగా గాలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్ చేసిన వ్యక్తి ఒకరేనని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. కాగా, గత కొద్ది కాలంగా తమిళనాడులో ఫేక్ బాంబు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి వారి ఇళ్లకు కూడా గతంలో ఫేక్ బాంబు కాల్స్ వచ్చాయి.

Latest News
 
8M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర సూరన్' టైటిల్ టీజర్ Sat, Apr 20, 2024, 04:34 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM