నా కాబోయే భర్తకి కళాత్మక హృదయం ఉంది : కాజల్

by సూర్య | Wed, Oct 14, 2020, 02:32 PM

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ నెల 30న ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. తనకు కాబోయే అత్తింటి వారితో ఆమె తీసుకున్న ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఇటీవలే, తనకు కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్ తీసుకున్న ఫొటో ఒకటి వైరల్ అయింది.


ఈ సారి గౌతమ కిచ్లూ కాజల్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఆ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుని, దానిని ఫొటో తీసి ఆయన పోస్ట్ చేశాడు. బెలూన్ డిజైనింగ్ తో ఉన్న ఆ ఫొటో చూడముచ్చటగా ఉంది. దీనిపై కాజల్ కూడా కామెంట్ చేసింది. డిజైన్ గొప్పదనాన్ని ఈ ఫొటో ప్రతిబింబిస్తోందని, తనకు కాబోయే భర్తకి కళాత్మక హృదయం ఉందని చెప్పింది.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM