బిగ్ బాస్ 4: అఖిల్‌ 'అర్జున్ రెడ్డి' అభిజిత్‌ 'వరల్డ్ ఫేమస్ లవర్'..

by సూర్య | Mon, Oct 12, 2020, 11:46 AM

సండే ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున కంటెస్టెంట్‌లతో డంబ్ షెరాడ్స్‌ గేమ్ ఆడించారు. ఓ బౌల్‌లో కొన్ని చిట్టీలు ఉండగా.. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి ఒక చిట్టీ తీసి అందులో ఉన్న సినిమా పేరును కెమెరాకు చూపించి దాన్ని సైగలతో చేసి చూపించాలి. ఆ సైగల ఆధారంగా మరో కంటెస్టెంట్ ఆ మూవీ పేరు చెప్పాలి. అలాగే ఆ సినిమా ఏ కంటెస్టెంట్‌కి సూట్ అవుతుందో చెప్పాలి.
ఈ గేమ్‌లో భాగంగా వరల్డ్‌ ఫేమస్ లవర్‌ పేరు రాగా.. ఆ టైటిల్‌ అభిజిత్‌కి సూట్ అవుతుందని హౌజ్‌మేట్స్ అన్నారు. ఆ తరువాత అభిజిత్ కోసం ఓ రొమాంటిక్ సాంగ్ వేయగా.. దానికి అరియానాతో స్టెప్పులు వేశాడు. మరోవైపు అభిజిత్‌ తనను ఎన్నిక చేసుకోవడంపై అరియానా ఓవర్ ఎగ్జైట్‌గా ఫీల్‌ అయ్యింది. అభితో డ్యాన్స్ చేస్తూ అస్సలు ఊహించలేదు అంటూ ఉప్పొంగిపోయింది. ఇక ఆదివారం అభి పుట్టినరోజు కాగా.. నాగ్‌తో పాటు ఇంటి సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు.
ఇక ఊహలు గుసగుసలాడే టైటిల్‌ను సుజాతకు అంకితం ఇచ్చారు. తర్వాత మెహబూబ్‌కు రేసు గుర్రం, అమ్మ రాజశేఖర్‌కు మాస్టర్‌, నోయల్‌కు శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, అరియానాకు జల్సా, సోహైల్‌కు పోకిరీ, అవినాష్‌కు డార్లింగ్‌, మోనాల్‌కి ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్షసి, కుమార్ సాయికి మత్తు వదలరా, హారికకు ఫిదా, అఖిల్‌కి అర్జున్ రెడ్డి, లాస్యకు పెదరాయుడు పోస్టర్ అంకితం చేశారు. ఇక అఖిల్ అర్జున్‌ రెడ్డి మూవీలో ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పినప్పుడు.. నీ వేలు మాత్రం కరెక్ట్‌గా చూపించావు అని నాగ్‌ సెటైర్ వేశారు. మొత్తానికి ఈ ఆట చాలా సరదాగా సాగింది.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM