కారులోనే నిద్రపోతున్న అనసూయ

by సూర్య | Mon, Oct 12, 2020, 11:06 AM

అనసూయ అంటే బుల్లితెరపై ఓ చెరిగిపోని అందం.. వెండితెరపై ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గొప్ప నటి. ఇలా గ్లామర్ డాల్‌గానే కాకుండా, నటిగానూ మెప్పించడం కొందరికే చెల్లుతుంది. క్షణం సినిమా కంటే ముందు అనసూయను కేవలం గ్లామర్‌తోనే నెట్టుకొస్తుంది.. ఆమెకు ఏమీ రాదంటూ విమర్శించేవాళ్లు. ఎప్పుడైతే క్షణం సినిమా వచ్చిందో నటిగా నిరూపించుకుందో అనసూయపై అందరికీ సదాభిప్రాయమే ఏర్పడింది.


అయితే తెలుగు యాంకర్లు, నటీమణుల్లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యేవారిలో అనసూయే ముందుంటుంది. అందరి కళ్లు అనసూయపైనే ఉంటుంది. ఆమె ఎలాంటి కామెంట్లు చేస్తుందా? ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుందా? అని, ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఓ బ్యాచ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. మొన్నామధ్య అనసూయ తన భర్త సుశాంక్ బర్త్ డే వేడుకలను సెలెబ్రేట్ చేసేందుకు గోవాకు చెక్కేసింది. అక్కడా కూడా అనసూయను వదల్లేదు.అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం అంటూ ఇలా ట్రోల్ చేసేశారు. మామూలుగా అనసూయ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కంటి నిండా కునుకు ఉండదు. అందుకే సెలెబ్రిటీలందరూ దాదాపు కారులోనే నిద్రపోతుండం, టిఫిన్, లంచ్ వంటివి చేస్తుంటారు. కొందరైతే ఏకంగా మేకప్‌లు కూడా కారులోనే వేసేసుకుంటారు. తాజాగా అనసూయ సండే కూడా వర్క్ చేయాల్సి వస్తోందని చెబుతూ.. కారులోనే నిద్రపోతోంది. పాపం అనసూయ గ్యాప్ లేకుండా పనులు చేస్తోందేమో. అసలే దసరా కూడా వచ్చేస్తోంది. మళ్లీ స్పెషల్ ఈవెంట్లంటూ వెరైటీ వెరైటీ ప్రోగ్రాంలుంటాయి.


 


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM