యువత హృదయాలను కొల్లకొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ ..ఫొటోస్

by సూర్య | Mon, Oct 12, 2020, 10:30 AM

కన్ను గీటి దేశ వ్యాప్తంగా కోట్లాది హృదయాల్ని కొల్లగొట్టింది వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ చిత్రం `ఒరు ఆదార్ లవ్` చిత్రంలోని ఓ పాటలో కన్ను గీటి రచ్చ చేసింది. ప్రియా నటించిన ఆ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారి ప్రియకు యమ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ స్థాయిలో అవకాశాల్ని అందించలేదు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూసింది కానీ దక్కించుకోలేకపోయింది.అయితే మొత్తానికి తెలుగులో ఓ క్రేజీ ఆఫర్నయితే దక్కించుకుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం `చెక్`. విభన్నకథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఉరిశిక్ష పడిన ఖైదీ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన నాయికగా నటిస్తుండగా రెండవ నాయికగా ప్రియా ప్రకాష్ వారియన్ కనిపించనుంది.  


`చెక్` తెలుగులో తొలి అవకాశం కావడంతో మరింతగా టాలీవుడ్ ని ఆకట్టుకుని మరిన్ని క్రేజీ ఆఫర్లని దక్కించుకోవాలని పాట్లు పడుతోంది. ఇటీవల తన యెద అందాల్ని చూపించి చూపించనట్టు ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. హొయలు పోతూ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రియకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రత్యేక దృష్టిని కనబరుస్తారని ఆమె ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారట.





Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM