సోషల్‌ మీడియా వేదికగా బిగ్ బికి బర్త్‌డే విషెష్

by సూర్య | Sun, Oct 11, 2020, 07:10 PM

యావద్భారతాన్నీ తనదైన అభినయంతో అలరించిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 11). నేటితో ఆయన 78 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెష్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ హీరోలు ట్విట్టర్‌ ద్వారా బిగ్‌ బికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.


ఈ దేశం చూసిన అత్యుత్తమ వ్యక్తులలో ఒకరైన లెజెండ్‌ అమితాబ్‌ జీ.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు విక్టరీ వెంకటేష్‌. అమితాబ్‌ జీ.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెప్పుడూ మాకు స్ఫూర్తి నింపుతూ, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కింగ్‌ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ సినిమా లెజెండ్‌ అమితాబ్‌ జీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సుతో ఇలాగే అలరిస్తూ ఉండాలని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పేర్కొంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM