చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయిపల్లవి

by సూర్య | Sun, Oct 11, 2020, 05:55 PM

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు మెహర్ రమేశ్ కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో బాక్సాఫీసు హిట్టయిన వేదాలమ్ చిత్రాన్ని ఇక్కడి నేటివిటీకి తగినట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.


తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలమ్ చిత్రంలో ఆయన చెల్లెలుగా లక్ష్మీమీనన్ నటించింది. ఇప్పుడదే పాత్రను డ్యాన్సింగ్ స్టార్ సాయిపల్లవి దక్కించుకుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీరియస్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో సాయిపల్లవి ఎలా అలరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిత్రం కావడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ లా మారింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తయితే మెహర్ రమేశ్ తో చిత్రం పట్టాలెక్కనుంది.

Latest News
 
నేడు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'పోకిరి' Sat, Apr 20, 2024, 02:58 PM
'మ్యూజిక్ షాప్ మూర్తి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 02:55 PM
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'హరోమ్ హర' Sat, Apr 20, 2024, 02:51 PM
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM