నా చిన్నారిని చూస్తే చాలా గర్వంగా ఉంది : మహేష్

by సూర్య | Sun, Oct 11, 2020, 04:36 PM

అదివారం(అక్టోబర్‌ 11) అంతర్జాతీయ ఆడపిల్ల దినోత్సవం. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ తన కుమార్తె సితారను ఉద్దేశిస్తూ అమ్మాయిలు ఎలా ఉండాలనే తన అభిప్రాయాన్ని తన ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నారు. "ఈ ప్రపంచంలో ఆడపిల్లల కంటే గొప్ప బహుమతి లేదు. నా చిన్నారిని చూస్తే చాలా గర్వంగా ఉంది. తన చిన్న ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటోంది. నీ కలలను విస్మరించవద్దు. నీ గొంతుక బలంగా వినిపించు. ధైర్యంగా ఉండు. నీకు మంచి అనిపించిన విషయాలపై గట్టిగా పోరాడు. మనం ఈ ప్రపంచంలో సమానత్వాన్ని సృష్టిద్దాం. నా చిన్నపాపతో ఈ ప్రపంచంలోని చిన్నారులందరితో అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం" అని మహేశ్‌ మెసేజ్‌ను షేర్‌ చేశారు. 

Latest News
 
అజిత్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో? Fri, Apr 19, 2024, 05:11 PM
'పుష్ప 2' హిందీ హక్కుల కోసం అనిల్ థాడాని ఎంత చెల్లించాడంటే...! Fri, Apr 19, 2024, 05:09 PM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM