దర్శక ధీరుడు రాజమౌళికి వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు

by సూర్య | Sat, Oct 10, 2020, 05:07 PM

సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నేడు తన 48వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. సినిమా రంగానికి రాకముందు పలు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఆ తర్వాత తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చేస్తూ 2001 సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసిన రాజమౌళి.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం దర్శక ధీరుడిగా కీర్తించబడుతున్నారు. రాజమౌళి.. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం విశేషం. ఇప్పటికి ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి దేనికవే ప్రత్యేకంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. ఇకపోతే బాహుబలి లాంటి భారీ సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కూడా రాజమౌళిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఐదేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడిన జక్కన్న. ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టారు. బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు రికార్డులన్నీ తిరగరాశాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఈగ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. మగధీర చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుతో పాటు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి. చిత్ర రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను పద్మ శ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. హీరోయిజాన్ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడంలో దిట్ట అని నిరూపించున్న ఆయన మరిన్ని భారీ సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తృతం చేయాలనే దిశగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్‌ని తనదైన స్టైల్‌లో ప్రెజెంట్ చేయనున్నారు రాజమౌళి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM