నిఖిల్ తో వరుసగా రెండు సినిమాల్లో అనుపమ .?

by సూర్య | Sat, Oct 10, 2020, 12:21 PM

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్ధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. హ్యాపీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినా స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ఇప్పుడు 'కార్తికేయ2' సినిమా చేస్తున్నాడు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


అంచనాలకు తగ్గట్లుగా మరో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు స్ర్కిప్ట్ వర్క్ చేశాడు. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వీటితో పాటు నిఖిల్ తన కెరీర్లో 20వ ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నారు. తాజా వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ  రెండు సినిమాల్లో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 'అఆ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పడు యంగ్ హీరో నిఖిల్ తో వరుసగా రెండు సినిమాల్లో కనిపించబోతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM