ఆర్జీవికి మరో షాక్ ..

by సూర్య | Sat, Oct 10, 2020, 10:52 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదమే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యదార్ధ సంఘటనల ఆధారంగా తనదైన స్టైల్ లో సినిమాలు తెరకెక్కించే వర్మ. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. దేశం మొత్తం కలకలం రేపిన దిశా ఘటన ఆధారంగా దిశా ఎంకౌంటర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఈ మధ్యనే విడుదల చేసాడు. తాజాగా ఈ సినిమా ఆపాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. బాధితురాలి తండ్రి ఈ పిటిషన్ వేయడంతో దీన్ని న్యాయమూర్తి శుక్రవారం విచారించారు. దిశ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ చేస్తున్న సమయంలో ఇలా సినిమా చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. దిశ తండ్రి మాట్లాడుతూ .. "దిశ సంఘట మా కుటుంబాన్ని తీవ్ర దుఖంలో మిగిల్చింది.ఇలాంటి సమయంలో దిశ ఎన్ కౌంటర్ పేరుతో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. నవంబర్ 26న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ కింద చాలా మంది అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు కూతురు కోల్పోయిన బాధలో మేము ఉంటే, మరోవైపు ఈ కామెంట్లు, ట్రైలర్ మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది. వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం ఎంత వరకు కరెక్ట్. హైకోర్టుతో పాటు నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ పిటీషన్ లు దాఖలు చేశాను. సినిమా అనేది ఎంటర్‌టైన్మెంట్గా ఉండాలి తప్ప ఇలా జీవితాలను రోడ్డు మీద పడేసాలా ఉండకూడదు. తక్షణమే ట్రైలర్ ను సోషల్ మీడియా నుండి డిలీట్ చేయడంతో పాటు సినిమాను నిలిపివేయాలి." అంటూ తన ఆవేదన ను వ్యక్తం చేశారు.

Latest News
 
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'ఆర్టికల్ 370' Fri, Apr 19, 2024, 03:57 PM
'స్పిరిట్‌' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 03:54 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Fri, Apr 19, 2024, 03:37 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సైరెన్' Fri, Apr 19, 2024, 03:33 PM
'పుష్ప 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 19, 2024, 03:29 PM