ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోబోను : హీరో నందు

by సూర్య | Fri, Oct 09, 2020, 12:56 PM

'బొమ్మ బ్లాక్‌బస్టర్‌' సినిమాలో హీరోగా నటిస్తోన్న నందు తన సినీ రంగ అనుభవాలపై ఆసక్తికర విషయాలు తెలిపాడు. తన సినిమాలు పెద్దగా ఆడి ఉండకపోవచ్చని, అయితే, సినీ నటుడిగా మాత్రం విఫలం‌ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. కొన్ని తప్పులు ఉన్నాయని,  వాటి నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాని ఆయన చెప్పుకొచ్చాడు. సినీ నటుడిగా తాను మరింత ఎదగడానికి కష్టపడుతున్నానని తెలిపాడు. ఇందుకోసం తాను 100 శాతం కృషి చేస్తానని చెప్పాడు.


నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చని తెలిపాడు. తాను ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోబోనని తెలిపాడు. తాను ఈ ఏడాది వచ్చిన 'సవారి' సినిమా నుంచి తన మైండ్‌సెట్‌ మార్చుకున్నానని చెప్పాడు. ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు నచ్చుతాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను నటుడిగా విజయం సాధించే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపాడు. కాగా, ఆయన కొత్త సినిమా  'బొమ్మ బ్లాక్‌బస్టర్‌' లో రష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM