ట్యూటర్ ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటున్న అలియా...

by సూర్య | Fri, Oct 09, 2020, 12:26 PM

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలైన మన హీరోయిన్లే తమకు తాము డబ్బింగ్ చెప్పుకోలేకపోయేవారు. డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరో ఒకరు వాళ్లకు చెప్పాల్సి వచ్చేది. అయితే, నేటి తరం కథానాయికలు అందుకు భిన్నం. ముఖ్యంగా ముంబై భామలు చాలా యాక్టివ్ గా వుంటున్నారు. తెలుగులో ఒకటి, రెండు సినిమాలు చేయగానే, తెలుగు మాట్లాడేస్తున్నారు. తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు.


ఈ క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్  కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సిద్ధపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో చరణ్ సరసన ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అలియా నిర్ణయించుకుందట. దాంతో ప్రస్తుతం ట్యూటర్ ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటోందని తెలుస్తోంది.


ఇదిలావుంచితే, లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తక్కువ మంది యూనిట్ తో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక హీరోయిన్ అలియా భట్ వచ్చే నెలలో ఈ చిత్రం షూట్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.

Latest News
 
1M+ వ్వ్యూ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Tue, Apr 23, 2024, 05:53 PM
'కింగ్‌' లో డాన్‌గా నటించనున్న షారూఖ్? Tue, Apr 23, 2024, 05:47 PM
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్-త్రినాధ రావు నక్కిన చిత్రం Tue, Apr 23, 2024, 05:45 PM
స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేసిన 'హనుమాన్' టీమ్ Tue, Apr 23, 2024, 05:43 PM
'వార్ 2' షూటింగ్ కోసం ముంబైకి బయలుదేరిన దేవర నటుడు Tue, Apr 23, 2024, 05:30 PM