బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్‌గా సోహైల్‌

by సూర్య | Fri, Oct 09, 2020, 10:21 AM

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్‌గా యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఎంపికయ్యాడు. గురువారం (32వ రోజు) జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో చిన్న సైజు పోరాటమే చేసి గెలుపొందాడు. అసలు పోటీలో నిలవడానికే అతను పెద్ద పోరాటం చేశాడు. బీబీ హోటల్‌ టాస్క్‌ అయ్యాక అతిథుల టీమ్‌ నుంచి ఒక బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ ఒకరిని, హోటల్‌ సభ్యుల్లో డబ్బుల్లో ఎక్కువ ఉన్న వారిని, సీక్రెట్‌ టాస్క్‌లో గెలిచిన అవినాష్‌ని కెప్టెన్సీ పోటీదారులుగా గుర్తించాడు.అతిథుల టీమ్‌ నుంచి బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే జరిగింది. తొలుత హారిక, మెహబూబ్‌, సోహైల్‌ తామే బెస్ట్‌ అని చెప్పారు. ఆరియానా… సోహైల్‌కు సపోర్టు చేసింది. ఆ తర్వాత రకరకాల చర్చలు జరిగి, బేరాలు పూర్తై ఆఖరికి సోహైల్‌ను బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా ఎంపిక చేశారు. ఇక ఇంట్లో ఎక్కువ టిప్‌ సంపాదించిన అఖిల్‌ (11,500) కెప్టెన్సీ పోటీకి ఎంపికయ్యాడు. దీంతో పోటీలో ముగ్గురు నిలిచారు.


 


 


 కెప్టెన్సీ టాస్క్‌గా బిగ్‌బాస్‌ ‘మంచు నిప్పు.. మధ్యలో ఓర్పు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా చేతిలో రెండు బౌల్స్‌ పెట్టి అందులో మంచు ముక్కలు వేశాడు. ఓ డయాస్ మీద నిలబడమని కింద నిప్పుల కుంపటి పెట్టారు. పైన పూర్తిగా నిల్చునే ఆప్షన్‌ లేకుండా కర్ర పెట్టారు. అలా ఒంగొని నిల్చోవడమే టాస్క్‌. ఇందులో తొలుత నిలబడలేక అఖిల్‌కు కింకొచ్చేశాడు. అవినాష్‌ ఆ తర్వాత దిగిపోయడు. దీంతో సోహైల్‌ గెలుపొందాడు.


 


బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఇప్పటివరకు ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇది ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఫిజికల్‌ టాస్క్‌ అయినప్పటికీ స్టెబిలిటీ, మెంటర్‌ స్ట్రెంగ్త్‌ ఇలా. అన్నింటినీ ఇందులో చూపించే అవకాశం ఉంది. ఫిట్‌గానే ఉంటూనే, తెలివిగా పోటీలో ఉండటం ఎలా అనేది ఇందులో చూపించాడు. ఇలాంటి పోటీలో యాంగ్రీ యంగ్‌మేన్‌ గెలిచాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో వరస్ట్‌ పర్‌ఫార్మర్‌గా అమ్మ రాజశేఖర్‌ అయ్యాడు. దీంతో అతనిని ఉల్లి పాయలు కట్‌ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు.


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM