గీతా మాధురి మాటలకు అర్థాలు వేరులే!

by సూర్య | Thu, Oct 08, 2020, 12:40 PM

బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ గా నిలిచిన గీతా మాధురి అడపాదడపా బిగ్ బాస్ షో గురించి కామెంట్స్ చేస్తూ వస్తుంది. బిగ్ బాస్ లో తన అనుభవాలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియెన్స్ కు షాక్ ఇస్తున్న గీతా మాధురి లేటెస్ట్ గా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే బిగ్ బాస్ కు వెళ్ళాలని సూచించింది. బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల వెయిట్ ఎలా లాస్ అవుతారు అనుకోవచ్చు. అంటే ఇన్ డైరెక్ట్ గా అక్కడ ఫుడ్ సరిగా ఉండదని పంచ్ వేసినట్టుంది గీతా మాధురి అంటున్నారు కొంతమంది. రెండేళ్ల క్రితం తను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినప్పటి ఫోటో షేర్ చేసిన గీతా మాధురి బిగ్ బాస్ కు వెళ్ళొస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతామని చెబుతుంది. కరెక్ట్ డైట్ ఇచ్చి తాను వెయిట్ లాస్ అవడానికి బిగ్ బాస్ కారణమని గొప్పగా చెబుతుంటే, ఇందులో కూడా పెడర్థాలు తీస్తారా అంటూ గీత అభిమానులు మరికొందరు అంటున్నారు. ఇది కూడా పాయింటేగా. మరి గీత ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసిందో ఆమెకే తెలియాలి.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM