నా అమూల్య‌మైన సంప‌ద వంటి నీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు లక్ష్మి : మోహన్ బాబు

by సూర్య | Thu, Oct 08, 2020, 12:28 PM

ప్రముఖ సినీన‌టి మంచు ల‌క్ష్మి ఈ రోజు పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటోంది. ఆమెకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆమె తండ్రి, సినీన‌టుడు మంచు మోహ‌న్ బాబు ఈ సంద‌ర్భంగా ఆమెను చిన్న‌ప్పుడు ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ త‌న కూతురికి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పారు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో మోహ‌న్ బాబు ఈ ఫొటో దిగిన‌ట్లు తెలుస్తోంది.


నా అమూల్య‌మైన సంప‌ద వంటి నీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు లక్ష్మి మంచు. ఎన్ని జ‌న్మ‌లైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ల‌వ్ యూ.. హ్యాపీ బ‌ర్త్ డే ల‌క్ష్మి మంచు అని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. నా ముద్దుల కుమార్తె మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న వ‌జ్ర వైఢూర్య పుష్య గోమేదిక మ‌ర‌క‌త మాణిక్యం లాంటిదంటూ ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంచు లక్ష్మి.. 'అ! నాన్న' అంటూ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసింది.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM