‘బిగ్ బాస్ సీజన్ 4’ లో మరో కౌశల్..?

by సూర్య | Thu, Oct 08, 2020, 12:05 PM

‘బిగ్ బాస్ సీజన్ 4’ షో విజేత ఎవరు అన్న విషయమై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈషోను చాలా నిశితంగా పరిశీలిస్తున్న ప్రేక్షకులు మాత్రం అభిజిత్ వ్యవహార శైలి పరిశీలిస్తూ ఇతడు మరొక కౌశల్ అవుతాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అభిజిత్ కొన్ని సినిమాలలో నటించినా అతడికి తగిన గుర్తింపు రాలేదు. దీనితో అభిజిత్ ను చాలామంది మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితులలో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ప్రస్తుతం తనదైన తరహాలో ఎత్తులు వేస్తూ ఈ షోలో కొనసాగుతున్నాడు. సరిగ్గా కౌశల్ కూడా అలాగే చేశాడు.
ఇక, తనకు ఇంగ్లీష్ భాష పై చాలా మంచి పట్టు ఉంది అని చెప్పుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ తాను తన హోస్ మేట్స్ కన్నా చాలామంచి చదువుకున్నాను అన్న చిన్నపాటి ఇగో అభిజిత్ ప్రదర్శిస్తున్నాడు. దీనికితోడు ఈషోకు సంబంధించిన రెండవ వారంలో తనకు తానే నామినేట్ చేసుకుని తన ఇగోని ప్రదర్శించాడు. ఇలా అభిజిత్ వేస్తున్న అడుగులు అన్నీ చూస్తుంటే గతంలో ‘బిగ్ బాస్ 2’ సీజన్ విన్నర్ గా వచ్చిన కౌశల్ ఛాయలు కనిపిస్తున్నాయి అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కౌశల్ లా.. అభి కూడా బిగ్ బాస్ విజేత అవుతాడా? చూడాలి మరి..

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM