గౌతమ్ కిచ్లూ సోదరికి కృతజ్ఞతలు చెప్పిన కాజల్...

by సూర్య | Wed, Oct 07, 2020, 06:17 PM

ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని, తమ దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు కాబోయే భర్త గౌతమ్‌ కిచ్లూ సోదరి గౌరి కిచ్లూ నాయర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కాజల్, గౌతమ్‌లతో తాను ఇటీవల దిగిన ఫొటోను షేర్‌ చేసింది.


వారిద్దరి మధ్య గౌరి కూర్చుని ఈ ఫొటో తీసుకుంది. ఆమె చేసిన పోస్టును చూసిన కాజల్ కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఈ ఫొటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకుంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు. కాజల్ గృహిణి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM