బన్నీతో సినిమా అంటే భయపడిన నిర్మాత

by సూర్య | Wed, Oct 07, 2020, 02:33 PM

టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ కి కాస్త ప్రత్యేకంగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అతనికి ఇప్పుడు డిమాండ్ కూడా చాలా బాగా పెరిగింది. అగ్ర దర్శకనిర్మాతలు అతనితో సినిమా చేయడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అతను రెండేళ్ల గ్యాప్ తీసుకుని గాని సినిమా చేయలేదు. అల వైకుంఠపురములో సినిమా తో అతను మంచి హిట్ కొట్టాడు.


ఇక ఇప్పుడు పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అతను భారీగా పారితోషికం కూడా తీసుకున్నాడు అని ప్రచారం జరిగింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు తమిళ సినిమాలో నటించడానికి అతను భారీగా డిమాండ్ చేశాడని అంటున్నారు. తమిళంలో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేయడానికి గాను దాదాపు ఏడు కోట్ల వరకు అతను డిమాండ్ చేశారని దీంతో తమిళ నిర్మాత కూడా భయ పడ్డాడు అని టాక్.


ఇటీవల అతను విజయ్ సేతుపతి సినిమాలో ఒక నెగిటివ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా ఎన్నో రోజులు ఉండదని కానీ అల్లు అర్జున్ మాత్రం అంత డిమాండ్ చేయడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆ నిర్మాత వెళ్ళాడు అని అంటున్నారు. తెలుగులో ఆ సినిమాను ఎలాగైనా సరే ఆడించాలని భావించి అల్లు అర్జున్ అంత మొత్తం డిమాండ్ చేశాడట. సదరు నిర్మాత బన్నీ ఆ రేంజ్ లో అడగటంతో... ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తమిళ విలన్ని తీసుకున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుందో చూడాలి.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM