ప్రభాస్ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా..?

by సూర్య | Wed, Oct 07, 2020, 01:54 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.


ఇదిలా ఉంటే.. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వనున్నారని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. పుట్టినరోజు కానుకగా ప్రభాస్ రాథేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ పూజా హేగ్డేతో పాటు మరి కొంత మంది ముఖ్యతారాగణం పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించలేదు. అయితే.. అభిమానులు మాత్రం రాథస్త్రశ్యామ్ టీజర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి.. రాథేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

Latest News
 
కార్తికేయ కోసం మెగా స్టార్ Sat, Apr 20, 2024, 03:19 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 03:17 PM
జెమినీ టీవీలో రేపు ప్రీమియర్ కానున్న సినిమాల లిస్ట్ Sat, Apr 20, 2024, 03:12 PM
'రత్నం' నుండి ప్రాణం నా ప్రాణం సాంగ్ అవుట్ Sat, Apr 20, 2024, 03:11 PM
'ప్రతినిధి 2' ట్రైలర్ రిలీజ్ Sat, Apr 20, 2024, 03:08 PM