'గుడ్ లక్ సఖి' చిత్రం కోసం రిస్క్ చేసిన కీర్తి సురేష్

by సూర్య | Wed, Oct 07, 2020, 12:13 PM

కెరీర్‌ లో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. సినిమాల ఎంపికలో చాలా ఆచితూచి వ్యవహరించే ఈమె, చేసిన దాదాపు అన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటోంది. ఏ ఒప్పుకుందో తెలీదు కానీ మహానటి సినిమాలో ఏకంగా తన నటనకు నేషనల్ అవార్డ్ దక్కించుకుని అది ఇచ్చిన బూస్టింగ్ తో ఈమె తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి ఖాతాలో ప్రస్తుతం రంగ్ దే, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా సినిమాలలతో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో అన్నాత్తే, మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రాలు ఉన్నాయి.
మొన్నీమధ్య తాజాగా మరో చిత్రం ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అది తమిళ సినిమా. అయితే కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గుడ్‌ లక్ సఖి గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ అసలు మేకప్ వేసుకోకుండా డి గ్లామర్ గా నటించిందట. అయితే డీ గ్లామర్ గా నటించడం పెద్ద విషయం కాదు కానీ, ఆమె నటించిన సీన్స్ ని కనీసం మోనిటర్ లో కూడా చూసుకోలేదట.
అయితే అయితే కీర్తి సురేష్ అలా ఎందుకు చేసిందా అని ఆరా తీస్తే దర్శకుడు నగేష్ ఇచ్చిన సలహా మేరకు అలా చేసిందని తేలింది. నగేష్ చెప్పాడని కీర్తి సురేష్ మోనిటర్ లో తానెలా నటించానో అనే విషయం చెక్ చేసుకోలేదట. రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈమె ఆర్జీవీ చేసిన కొన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. ఈ సినిమాతోనే ప్రొడక్షన్ లోకి దిగింది. దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మితం అవుతోంది.

Latest News
 
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM