రవితేజ 'క్రాక్' సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభం..

by సూర్య | Wed, Oct 07, 2020, 11:40 AM

మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీనితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ తెలిపింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేర ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ ఆధ్వర్యంలో బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ నటులు సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాతల్లో కనిపించనున్నారు. తమిళంలో సూపర్‌హిట్ చిత్రాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన జికె విష్ణు 'క్రాక్'కు సేవలందిస్తున్నారు.
వివరాలు....కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేనినిర్మాత: బి మధుబ్యానర్: సరస్వతి ఫిల్మ్స్ డివిజన్సంగీతం: ఎస్.ఎస్.తమన్ఛాయాగ్రహణం: జికె విష్ణుసంభాషణలు: సాయి మాధవ్ బుర్రాసహ నిర్మాత: అమ్మీ రాజు కనుమిల్లిఎడిటింగ్: నవీన్ నూలిఆర్ట్ డైరెక్టర్: ప్రకాష్ గాఫైట్స్: రామ్-లక్ష్మణ్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిమేకప్: శ్రీనివాస రాజుకాస్ట్యూమ్స్: శ్వేత, నీరజ కోనస్టిల్స్: సాయిపీఆర్వో: వంశీ శేకర్పబ్లిసిటీ డిజైనర్: వర్కింగ్ టైటిల్ శివప్రొడక్షన్ కంట్రోలర్: కొట్టపల్లి మురళీ కృష్ణసహ దర్శకులు: గులాబీ శ్రీను, నిమ్మగడ్డ శ్రీకాంత్చీఫ్ కో-డైరెక్టర్: పివివి సోమ రాజు

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM