బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌ను రీ స్టార్ట్‌ అప్పుడే...

by సూర్య | Tue, Oct 06, 2020, 05:39 PM

సక్సెస్‌ఫుల్‌ హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే ఎన్ని అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి అంచనాలే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ మూవీపై ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా, లెజెండ్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర సెన్సేషనల్‌ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కోవిడ్‌ ప్రభావంతో ఆగిన బాలకృష్ణ 106వ సినిమా షూటింగ్‌ నవంబర్‌ నుండి ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్స్‌ అందరూ వారి సినిమాలను స్టార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌ను రీ స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌కు సంబంధించిన లొకేషన్స్‌ కోసం యూనిట్‌ సభ్యులు అన్వేషణలో ఉన్నారట. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM