ఆర్ఆర్ఆర్: రామరాజు ఫర్‌ భీమ్‌కి డేట్ ఫిక్స్‌

by సూర్య | Tue, Oct 06, 2020, 11:21 AM

ప్యాన్‌ ఇండియా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'రౌద్రం రణం రుధిరం' ముందు వరుసలో ఉంది. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌ పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న చిత్రమిది. 'బాహుబలి'తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇస్తామని చిత్ర యూనిట్‌ సోమవారమే అనౌన్స్‌ చేసింది. దీంతో ఎలాంటి అప్‌డేట్‌ రానుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు భీమ్‌ ఫర్‌ రామరాజు అంటూ అల్లూరి పాత్రను ఎన్టీఆర్‌ వాయిస్‌లో పరిచయం చేసిన చరణ్‌ ప్రోమోను యూనిట్‌ విడుదల చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. లాక్‌డౌన్‌ సమయంలోనే తారక్‌ కొమురం భీమ్‌ పాత్రకు సంబంధించిన ప్రోమో విడుదలవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. కానీ ప్రోమోకు సంబంధించిన షూట్‌ పెండింగ్‌ ఉండటంతో జక్కన్న ఎన్టీఆర్‌ ప్రోమోను విడుదల చేయలేదు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ ప్రోమో విడుదలవుతుందా? అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో రాజమౌళి అండ్‌ టీమ్‌ లేటెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు.


తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 22న 'ఉయ్‌ ఆర్‌ బ్యాక్' అంటూ 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "మార్చి వరకు మా షూటింగ్‌ అనుకున్నట్లు ముందుకు సాగింది. ఆ తర్వాత ప్రపంచమంతా ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది.. రెట్టించిన ఉత్సాహంతో..." అంటూ మెసేజ్‌తో పాటు వీడియోను విడుదల చేశారు. ఇందులో అన్నీ విభాగాలవాళ్లు షూటింగ్‌ను పునః ప్రారంభించడానికి ఏమేం పనులు చేశారనే దాంతో పాటు మంగళవారం నుండి షూటింగ్‌ జరగనుందని తెలియజేశారు. చివర్లో హీరోస్‌ రెడీ, యాక్షన్‌ అని జక్కన్న అనగానే మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ గుర్రంపై.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై వచ్చే సీన్‌ను వీడియోలో చూపించారు. త్వరలోనే రామరాజు ఫర్‌ భీమ్‌ ప్రోమో వస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రోమో విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM