ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలవడంతో న కల సాధ్యమైంది :తాప్సి

by సూర్య | Sat, Apr 04, 2020, 09:47 PM

తెలుగులో కంటే హిందీలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి తాప్సీ. 2010లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాప్సి 2020లో తన మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. 2019 అక్టోబర్ నెలలో విడుదలైన 'సాండ్ కి ఆంఖ్' సినిమాలో తాప్సి చేసిన పాత్రని ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. బాలీవుడ్ లో బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంటున్నాయి. ఆ కోవలో.. ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్ - చంద్రో తోమర్ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సాండ్ కీ ఆంఖ్'. 'మస్తీ' - 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' వంటి క్రైమ్ - హారర్ కామెడీ చిత్రాలకు రచయితగా పనిచేసిన తుషార్ హీరానందని ఒక మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మహిళలు తలుచుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పనినైనా అలవోగా చేసేస్తారనడానికి ప్రకాషి - చంద్రోలే ఉదాహరణ. వాళ్ల స్ఫూర్తిదాయక కథను అంతే స్ఫూర్తిమంతంగా తెరపై చూపించాడు దర్శకుడు. ఇక 'సాండ్ కీ ఆంఖ్' చిత్రంలో బెస్ట్ నటన కనబర్చినందుకు గాను ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకుంది తాప్సి. అవార్డుల విషయంలో వస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ..ఈ వివాదంలో నా పేరు రాకపోవడం సంతోషంగా ఉంది. నిజంగా నా ప్రతిభకు ఈ అవార్డు వచ్చిందని నమ్ముతున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని .. ఈ అవార్డు రాకతో తాప్సి కల నెరవేరిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్యే తాప్సి తన ఇంస్టాగ్రామ్ లో హ్యాపీగా 'మొత్తానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలవడంతోనే నేను ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీపై కనిపించడం సాధ్యమైందని పేర్కొంది.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM