మరోసారి సుకుమార్ -రామ్ కాంబో

by సూర్య | Sat, Apr 04, 2020, 08:47 PM

ప్రస్తుతం సుకుమార్ .. బన్నీ కథానాయకుడిగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన బిజీగా వున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ ప్రాజెక్టు తరువాత సుకుమార్ ఏ హీరోతో సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలోనే రామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే రామ్ కి సుకుమార్ ఒక కథ వినిపించడం, కథ చాలా కొత్తగా ఉందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. 2007లో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జగడం' సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదుగానీ, రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అవుతోంది. బన్నీ సినిమాను పూర్తిచేసిన తరువాతనే రామ్ సినిమాపై సుకుమార్ శ్రద్ధ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM