'కార్తికేయ 2' కోసం నిఖిల్ సిక్స్ ప్యాక్

by సూర్య | Sat, Apr 04, 2020, 02:36 PM

నిఖిల్ కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'అర్జున్ సురవరం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. గతంలో విజయాన్ని సాధించిన 'కార్తికేయ'కి ఇది సీక్వెల్. 'కార్తికేయ 2' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఈ సినిమాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో 4 వారాలలో పూర్తి షేప్ ను సాధిస్తానని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చందూ మొండేటికి ఈ సీక్వెల్ ఊరటనిస్తుందేమో చూడాలి.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM