మరోసారి పూరి ,బాలకృష్ణ కంబో..

by సూర్య | Sat, Apr 04, 2020, 02:11 PM

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి  'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. కరణ్ జొహార్ తో కలిసి పూరి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ తో పూరి సినిమా ఉండొచ్చనే వార్తలు వినిపించాయి. మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.అయితే తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్' సినిమా చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, బాలయ్యను కొత్తగా చూపించడంలో మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటి నుంచి ఆయనకి బాలయ్యతో మంచి సాన్నిహిత్యం వుంది. ఆయనను ఒప్పించగలననే నమ్మకంతో పూరి ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే బాలయ్యకు ఆ కథను వినిపించనున్నాడని అంటున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM