షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ : పూజా హెగ్డే

by సూర్య | Sat, Apr 04, 2020, 02:10 PM

పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత  మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. అందులో భాగంగా కొందరు ఇంటి పనులలో బిజీగా ఉంటుండగా, మరికొందరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా పూజా దానికి సమాధానం ఇస్తూ... షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తెలిపింది. మరో ప్రశ్నకు సమాదానంగా తన అభిమాన గాయకుడు ఎ ఆర్ రెహమాన్ అని తెలిపింది.ఇక వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అంతేకాదు దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది. ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM