నటీనటుల పై ఫైర్ అయినా ఆర్ కే సెల్వమణి

by సూర్య | Sat, Apr 04, 2020, 01:31 PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు కుప్పలు తెప్పులుగా పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలెవరూ రోడ్ల మీదుక రాకూడదని - ఇంటికి పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో దేశంలో అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు - శ్రామికులు - కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇందుకు సినీ పరిశ్రమ కూడా అతీతం కాదు. ముఖ్యంగా దక్షణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు చెందిన సభ్యులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.ఈ సందర్భంగా దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు - ప్రముఖ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి మాట్లాడుతూ నటీనటులకు మానవత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..దక్షణ భారత సినీ కార్మికుల సమాఖ్యలో 25 వేల మంది సభ్యులు ఉండగా - వీరిలో 18 వేల మంది రోజూవారీ వేతన కార్మికులే. వీరికి పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితని - ఆర్థికసాయంతో ఆదుకోవాలంటూ సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తికి చాలా అతి కొద్దిమంది మాత్రమే స్పందించారు. నటుడు సూర్య కుటుంబం - నటుడు రజనీకాంత్ - కమల్ హాసన్ - విజయ్ సేతుపతి - శివకార్తికేయన్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఫెఫ్సీకి ఆర్థికసాయం అందించారు.ఇందులో రజనీకాంత్ మాత్రమే భారీగా రూ. 50 లక్షలను సాయం చేశారు. దీంతో ఇతర ప్రముఖ నటీనటులు ఫెప్సీకి సాయంపై స్పందించకపోవడంపై ఆర్కే సెల్వమణి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలా మొత్తం మీద ఇప్పటి వరకు ఫెఫ్సీకి రూ. 1.60 కోట్లు - 25 కేజీలతో కూడిన 1983 బస్తాల బియ్యం అందాయి. దీంతో సమాఖ్యలోని ఒక్కో సభ్యుడికి 25 కిలోల బియ్యం - రూ. 500 నగదు మాత్రమే సాయం చేయగలుగుతుందని - ఇది వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోదని అన్నారు. కాగా ఇతర రాష్ట్రాల్లో నటీనటులు కోట్ల రూపాయల్లో ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. అలాంటిది మన నటీనటులకు సాయం చేసే మానవత్వం లేకపోయిందని ఆర్ కే సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు. మరి సెల్వమణి విజ్ఞప్తిని వినైనా నటీనటులు సాయం చేయడానికి ముందుకు వస్తారేమో చూడాలి.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM