మరోసారి కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్

by సూర్య | Sat, Apr 04, 2020, 11:17 AM

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. జులై నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది. తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాక ముందే ఎన్టీఆర్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టిన శివ.. ఆ తర్వాత తన టాలెంట్‌తో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు. శివ వరుసగా హిట్స్ ఇస్తూ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ లాంటీ వారు కూడా ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొర‌టాల మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM