చిరంజీవితో సినిమా చేసిన తర్వాత ఈ దర్శకుల కెరీర్ ఇలా అయిపోవడం ఏంటో...!

by సూర్య | Thu, Apr 02, 2020, 02:40 PM

అదేంటి.. చిరంజీవితో సినిమా చేయాలని దర్శకులు మొత్తం కలలు కంటారు.. అలాంటిది ఆయనతో సినిమా చేయడం పాపం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇద్దరు దర్శకుల విషయంలో ఇదే జరుగుతుంది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో పని చేసిన దర్శకులు ఇద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు. వినాయక్ అయితే ఖైదీ నెం 150 తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. సాయి తేజ్ హీరోగా ఇంటిలిజెంట్ సినిమాను అప్పుడెప్పుడో 2018 ఫిబ్రవరిలో విడుదల చేసాడు. ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మధ్యలో బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా కుదర్లేదు.


దాంతో దర్శకత్వం కొన్ని రోజులు పక్కనబెట్టి హీరోగా ట్రై చేసాడు కూడా. సీనయ్య అంటూ వచ్చే ప్రయత్నం చేసినా అది కూడా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఖైదీ నెం 150కి కూడా వినాయక్ జస్ట్ దర్శకుడు మాత్రమే అంతా చిరంజీవి పక్కనే ఉండి చూసుకున్నారనే వాళ్లు కూడా లేకపోలేదు. పైగా పదేళ్ల తర్వాత అన్నయ్య నటించిన సినిమా కావడంతో ఆ మేనియాలో ఖైదీ ఆడేసింది.


ఇదిలా ఉంటే సైరా సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి కూడా ఇప్పటి వరకు తర్వాతి సినిమా ఏంటనేది చెప్పడం లేదు. సైరా తెలుగులో విజయం సాధించినా కూడా మిగిలిన భాషల్లో డిజాస్టర్. ఇక్కడ కూడా సూపర్ హిట్ ఏం కాదు.. జస్ట్ హిట్ అంతే. కొన్నిచోట్ల అయితే పెట్టుబడికి కొద్ది దూరంలో ఆగిపోయింది. సైరా విడుదలై ఆర్నెళ్లు గడిచింది.. చిరంజీవి కూడా మరో సినిమాను మొదలుపెట్టాడు కానీ సురేందర్ రెడ్డి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.


చిరంజీవి తర్వాత ఎవర్ని డైరెక్ట్ చేయాలో ఈయనకు అర్థం కావడం లేదు. అఖిల్ కోసం కథ రాసుకున్నాడనే ప్రచారం జరుగుతున్నా కూడా అతనొక్కడే తర్వాత ఈయన ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతో అయితే పని చేయలేదు. మొత్తానికి యాదృశ్చకమో ఏమో కానీ చిరంజీవితో సినిమా చేసిన తర్వాత ఈ దర్శకుల కెరీర్ ఇలా అయిపోవడం ఏంటో మరి..?

Latest News
 
షాకింగ్ టిఆర్పీని నమోదు చేసిన 'బలగం' Thu, Apr 18, 2024, 03:21 PM
ఓపెన్ అయ్యిన 'పారిజాత పర్వం' టికెట్ బుకింగ్స్ Thu, Apr 18, 2024, 03:19 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 03:14 PM
'పోటెల్' టీజర్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Apr 18, 2024, 02:58 PM
కృష్ణమ్మ లోని 'థీమ్ అఫ్ వెంగెర్న్స్' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 18, 2024, 02:53 PM