ఒక కుహనా మేధావి కథ ఆర్జీవీ

by సూర్య | Thu, Apr 02, 2020, 01:10 PM

సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్‌ సినీప్రైమ్‌ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్‌ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వది నాన్ని పురస్కరించుకుని మీడియాకు విడుదల చేశారు, ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే ”శ్రీరామనవమి” పర్వదినాన ఈ చిత్ర టైటిల్‌ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు. నటీనట వర్గం: సురేష్‌, రాశి, శ్రద్ధా దాస్‌, అమిత్‌, పునర్నవి భూపాలం, తేజ తదితరులు.


సాంకేతిక నిపుణులు ఛాయాగ్రహణం : వేదాంత్‌ మల్లాది ..సంగీతం : వీణాపాణి..కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM