నేను ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు : పూజాహేగ్డే

by సూర్య | Thu, Apr 02, 2020, 08:13 AM

నేను ఏ సినిమాలో నటిస్తున్నానో నాకు తెలియడం  కంటే ముందే సోషల్‌మీడియాలో వార్తలు రావడం ఆశ్చర్యంగా వుంది. ప్రస్తుతానికి నేను ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు. అయితే తప్పకుండా భవిష్యత్‌లో తమిళ సినిమా చేస్తాను’ అంటున్నారు పూజాహేగ్డే. అల వైకుంఠపురములో’ విజయంతో దక్షిణాది చిత్రసీమలో పూజాహెగ్డేకు మంచి డిమాండ్‌ వచ్చింది.  స్టార్‌ హీరోల సినిమాల్లో ఆమెను కథానాయికగా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఆమెను పలు అవకాశాలు వరిస్తున్నాయి.  తాజాగా తమిళంలో హీరో సూర్య సరసన ఆమె నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.   సూర్య, దర్శకుడు హరి కలయికలో ‘అరువా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్నది. అయితే ఈ చిత్రంలో తను నటించడం లేదని దయచేసి నా సినిమాల గురించి ముందుగా నన్ను ఓ నిర్ణయానికి రానివ్వండి అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది పూజాహేగ్డే. 


 


 


 

Latest News
 
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నార్త్ అమెరికా గ్రాస్ ఎంతంటే ...! Mon, Apr 15, 2024, 07:08 PM