మణిరత్నం సినిమాకు నో చెప్పిన అమలాపాల్

by సూర్య | Wed, Apr 01, 2020, 01:50 PM

అమలాపాల్ పేరు ఈ మధ్య తరచూ వార్తల్లో వినపడుతూనే వుంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాలు చేసిన అమలాపాల్ జీవితం వివాహంతో ఒక్కసారిగా మారిపోయింది. ప్రేమ పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని కారణాల వలన భర్త నుండి విడాకులు తీసుకుంది. దాని తర్వత ముంబైకు చెందిన గాయకుడు భవ్నీందర్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అమలాపాల్‌ తనకు వివాహం జరగలేదని, అవి కేవలం ఫోటోషూట్‌ కోసం దిగిన ఫోటోలని స్పష్టం చేశారు.తాజా సమాచారం మేరకు మణిరత్నం సినిమాలో నటించడానికి తిరస్కరించిందట ఈ ముద్దుగుమ్మ. అందివచ్చిన ఛాన్స్ ని వదులుకుందట. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. నాకు సూట్ అవ్వని పాత్రను చేయడం కన్నా వదిలేసుకోవడం మంచిదని భావించాను. ఒకవేళ అలాంటిది చేస్తే రేపు అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే మణిరత్నం చిత్రాన్ని వదులుకున్నాను అని అమలాపాల్ తెలిపింది.

Latest News
 
'హరోమ్ హర' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 23, 2024, 03:56 PM
'కృష్ణ ఫ్రొం బృందావనం' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Apr 23, 2024, 03:52 PM
'ప్రతినిధి 2' ని USAలో విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 23, 2024, 03:45 PM
తెలుగులో 'నాయట్టు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Tue, Apr 23, 2024, 03:39 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Tue, Apr 23, 2024, 03:37 PM