కెరియర్ పరంగా ఎత్తుపల్లాలు ఉండటం సహజం : అంజలి..

by సూర్య | Wed, Apr 01, 2020, 01:37 PM

అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముందుగా తమిళంలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాతనే ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. తెలుగులోను కథానాయికగా ఆమె వరుస విజయాలను అందుకుంది. అలాంటి అంజలికి కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో, సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.


తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "కెరియర్ పరంగా ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అవకాశాల కోసం నేను ఎప్పుడూ అంతగా ఎదురుచూడలేదు .. రాలేదని బాధపడలేదు. కానీ ఆ మధ్య మా కుటుంబంలో జరిగిన  గొడవలు అందరి నోళ్లలోను నానాయి.  ఆ సమస్యల కారణంగా నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చినవారు చాలా తక్కువమంది. నాకు సన్నిహితులుగా వున్నవారే నా గురించి హేళనగా మాట్లాడటం నాకు బాధను కలిగించింది. ఇప్పటికీ ఆ మాటలు నా మనసును గాయపరుస్తూనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Fri, Apr 19, 2024, 03:37 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సైరెన్' Fri, Apr 19, 2024, 03:33 PM
'పుష్ప 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 19, 2024, 03:29 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Fri, Apr 19, 2024, 03:26 PM
'పోటెల్' టీజర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 03:20 PM