‘వకీల్ సాబ్’ న్యూ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్...

by సూర్య | Wed, Apr 01, 2020, 11:50 AM

పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చేత్తో ఫైల్స్, మరో చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకొని కోర్టులో కేసు వాదించడానికి వెళ్తుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. అచ్చం అఫీషియల్ పోస్టర్‌లా ఉన్న దీన్ని ఒక ఫ్యాన్ క్రియేట్ చేసారు. ఈ చిత్రాన్ని ముందుగా మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాను ఎపుడు విడుదల చేసేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇపుడు వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో క్రిష్, హరీష్ శంకర్, బాబీ, డాలీ, త్రివిక్రమ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM