అలోవెరా జెల్ చాలా ఉపయోగాలు : మలైకా అరోరా

by సూర్య | Wed, Apr 01, 2020, 08:19 AM

సెలబ్రెటీలు కొందరు జిమ్ లో వర్కౌట్స్ లేక పోవడం తో బరువు పెరుగుతామేమో అని భయపడుతున్నారు. మరికొందరు బ్యూటీ పార్లర్ కు వెళ్లక పోవడం వల్ల తమ స్కిన్ చెడిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే చర్మంను కాంతి వంతంగా ఉంచుకోవడం తో పాటు పలు అనారోగ్య సమస్యలకు ఎలా దూరంగా ఉండాలనే విషయాన్ని బాలీవుడ్ నటి  మలైకా అరోరా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తోంది. అలోవేరా తో చర్మంను పరిరక్షించుకోవాలని ఆమె సూచిస్తోంది. ప్రస్తుతం తాను తీసుకుంటున్న స్కిన్ కేర్ గురించి ఆమె తెలిపింది. అలోవేరా జెల్ చాలా గొప్ప స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఇది ప్రతి ఒక్కరికి కూడా బాగా పని చేస్తుంది. చర్మంపై ఉండే ర్యాషెష్ ఇంకా కోతలు చర్మం కమిలి పోవడం వంటివి ఉంటే అలోవేరా జెల్ బాగా పని చేస్తుందని మలైకా చెబుతోంది. చర్మంకు అలోవేరా జెల్ బాగా పని చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అలోవేరా జ్యూస్ తో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ మలైకా పేర్కొంది. ఈ లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా మీ చర్మంను ఇంట్లోనే ఉండి కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని సూచించింది.


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM