'సత్య'కి మాటలు రాశాను

by సూర్య | Tue, Mar 31, 2020, 12:56 PM

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ, 'సత్య' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. 'సత్య' సినిమాలో వర్మ నాతో మాటలు రాయించాడు. అయితే వాటికన్నా ముందే 'మామ కల్లు మామ' పాట రాశాను. ఈ పాటను సిరివెన్నెలతో రాయించాలని వర్మ అనుకున్నాడు. సిరివెన్నెల రాసిన వెర్షన్స్ వర్మకి నచ్చడం లేదు. క్రిమినల్స్ పాడుకునే పాటకి పాండిత్యంతో పనిలేదు. అందువలన సరదాగా నేను ఆ ట్యూన్ కి పాట రాసి వర్మకి వినిపించాను. ఆయన 'ఇదీ నాకు కావలసింది' అని వెంటనే రికార్డ్ చేయించాడు. ఆ కేసెట్ తీసుకెళ్లి సిరివెన్నెలగారికి వినిపించి, జరిగింది చెప్పవలసిన బాధ్యతను నాపైనే పెట్టాడు. దాంతో ఆ కేసెట్ తీసుకెళ్లి నా పాటను రికార్డు చేశారని సిరివెన్నెల గారికి వినిపించవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏమంకుంటారోననే టెన్షన్. అయితే ఆయన ఆ పాటను విని 'తను మరో పది వెర్షన్స్ రాసినా అలా వుండేది కాదు' అంటూ నన్ను హత్తుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM