జంతువుల సంరక్షించే బాధ్యత మనదే : అక్కినేని అమల

by సూర్య | Tue, Mar 31, 2020, 11:22 AM

లాక్‌డౌన్ నేపథ్యంలో నాగార్జున భార్య అమల అక్కినేని అమూల్యమైన సలహా ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..  లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని ప్రజలు 21 రోజులు ఇంటికే పరిమితయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనుషులతో పాటు జంతువులను కూడా కాపాడుకోవాలని అమల పిలుపునిచ్చారు. ఈమె రెడ్ క్రాస్ సోసైటీ తరుపున తన వంతుగా జంతువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ అరికట్టాడానికి ప్రజలు ఇంట్లోని ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాదు సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేయాలన్నారు. అంతేకాదు మన దగ్గర ఉన్న జంతువులతో ప్రేమగా ఉండాలన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కూడా జంతువుల సంరక్షించే వెటర్నరీ  కేంద్రాలు తెరిచే ఉంటాయన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జంతు సంరక్షణకు సంబంధించిన ఫోన్ నెంబర్స్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసారు. మొత్తానికి లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకు ఏమైనా ఐతే అని ఆందోళన వ్యక్తం చేసే వాళ్లకు అక్కినేని అమలగారు సూచించిన వెటర్నరీ కేంద్రాలను సంప్రదిస్తే సరిపోతుంది. మొత్తానికి కరోనా వైరస్ కేవలం మనుషులనే కాదు జంతువులకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఇలాంటి నేపథ్యంలో అమల జంతువుల సంరక్షణ కోసం చేసిన ట్వీట్‌ను చూసి జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM